దానిమ్మ గింజలు తింటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
Jyothi Gadda
22 July 2025
దానిమ్మ ఆరోగ్యకరమైన, పోషక విలువలతో నిండిన పండు. దీని గింజలు ప్రతిరోజూ తినడం ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
దానిమ్మ గింజలు యాంటీ ఆక్సిడెంట్లు, పొలిఫినాల్స్ అనే రసాయనాలతో నిండి ఉంటాయి. ఇవి హృదయానికి మంచిది. కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి.
రోజూ దానిమ్మ గింజలను తినడం వలన చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. జీర్ణవ్యవస్థకు మేలు చేసే ఫైబర్ దానిమ్మలో పుష్కలంగా ఉంటుంది.
దానిమ్మ గింజలు విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్, పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు మరియు పలు ఖనిజాలు కలిగి ఉంటాయి.
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలీఫెనాల్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి కణాలను రక్షించడంలో సహాయపడతాయి.
రోజు క్రమం తప్పకుండా తింటే హై బీపీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ధమనులలో అడ్డంకులు ఏర్పడవు. గుండె జబ్బుల ప్రమాదం చాలా తగ్గుతుంది.
దానిమ్మ పండులో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి.
దానిమ్మ గింజల్లో ఎలాజిక్ ఆమ్లం, ఆంథోసైనిన్లు వంటి కొన్ని సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
బంగారం కొంటున్నారా ? ఈ విషయాలు గుర్తించుకోండి
రోజు ఒక జామకాయను తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే..!
బొబ్బర్లు తింటే బోలెడు ప్రయోజనాలు!