ఈ పండు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను చటుక్కున లాగేస్తుంది..!

Jyothi Gadda

06 June 2025

డయాబెటిస్‌తో బాధపడే వారు యాపిల్ తినాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఒక యాపిల్ తినాలని వైద్యులు చెబుతుంటారు. ఇది షుగర్‌ కంట్రోల్‌ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.   

 కొన్ని నివేదికల ప్రకారం యాపిల్స్ లో పెక్టిన్‌ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ని కట్ చేస్తుంది. 

యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, పొటాషియం కూడా ఉంటుంది. ప్రధానంగా ఇందులో విటమిన్-డి ఎంజైమ్స్‌ ఉంటాయి. హార్మోన్ సమతులతకు  ఉపయోగపడతాయి. 

రోజూ యాపిల్‌ తింటే మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గ‌డ‌మే కాదు, జీర్ణ వ్య‌వ‌స్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అసిడిటీ స‌మ‌స్య బాధించ‌దు.

యాపిల్‌ను తింటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. బీపీ అదుపులోకి వ‌స్తుంది. ర‌క్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. తీవ్ర ర‌క్త స్రావం జ‌ర‌గ‌కుండా అడ్డుకోవ‌చ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయి.

రోజుకో యాపిల్‌ను తింటే బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. టైప్ 2 డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ఊపిరితిత్తులు మెరుగ్గా ప‌నిచేస్తాయి. మెద‌డు ఆరోగ్యంగా ఉంటుంది. 

ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాల‌న్నా కూడా యాపిల్ ప‌నిచేస్తుంది. ఇందులో ఉండే విట‌మిన్ కె, క్యాల్షియం ఎముక‌ల సాంద్ర‌తను పెంచుతాయి.

బీపీ, షుగర్ కూడా అదుపులో ఉంటుంది. గుండె సమస్యలకు చెక్ పెడతాయి, కొలెస్ట్రాల్ పూర్తిగా నివారిస్తాయి. మొత్తానికి యాపిల్ ఒక సమతుల ఆహారం అవుతుంది.