గుమ్మడి గింజలు ఆరోగ్యానికి వరం.. కానీ వీరు మాత్రం తినకూడదంట !
samatha
31 MAY 2025
Credit: Instagram
గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా ప్రతి రోజూ గుమ్మడి గింజలు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు.
గుమ్మడి గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, పొటాషియం, ఆరోగ్యకరమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయంటారు.
అంతే కాకుండా గమ్మడి గింజలను ప్రతి రోజూ తీసుకోవడం వలన ఇందులోని ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తాయి.
అలాగే గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఎముకల నొప్పి, జుట్టు రాలడం, వంటి సమస్యలను నియంత్రిస్తుంది.
అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంత మంది మాత్రం ఈ గుమ్మడి గింజలను అస్సలే తీసుకోకూడంట. వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పాలిచ్చే తల్లులు, గర్భిణీలు, గుమ్మడి గింజలను అతిగా తీసుకోకూడదంట. అలాగే మధుమేహ వ్యాధి గ్రస్తులు కూడా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే గుమ్మడి గింజలు తీసుకోవాలట.
లో బీపీ సమస్యతో బాధపడే వారు గుమ్మడి గింజలకు కాస్త దూరం ఉంటేనే మంచిది అంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తపోటు స్థాయిలను తగ్గిస్తాయి.
గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. మీరు దానిని అధిక పరిమాణంలో తింటే అతిసారం సమస్య ఉండవచ్చు. ఇది కాకుండా ఇది కడుపు నొప్పి, తిమ్మిరి, ఉబ్బరం పెంచుతుంది.