ఉత్తర భారత దేశంలో ఉన్న అందమైన పూలతోట గురించి తెలుసా?
samatha
30 MAY 2025
Credit: Instagram
అందమైన పూలతోటల్లో ఎంజాయ్ చేయాలని ఎవరు అనుకోరు చెప్పండి. చాలా మందికి పూలతోటల్లో తిరుగుతూ ఆనందంగా గడపాలి అనుకుంటారు.
అయితే మన ఉత్తర భారతదేశంలో వ్యాలీ ఆఫ్లవర్స్ జాతీయ ఉద్యాన వనం ఉన్నదంట. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుందంట.
ఈ అతి సుందరమైన ప్రదేశం ఉత్తరఖాండ్‌లోని చమోలీ జిల్లాలో ఉన్నదంట. ఇక్కడి అందమైన రంగు రంగుల పూలతోటలు ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయంట.
పూలతోటల మధ్య సాగే ట్రెక్కింగి అంద్భుతమైన, ఆనందకరమైన అనుభూతిని ఇస్తుందంట. కాగా, ఉత్తర భారత దేశంలో ఉన్న ఈ వ్యాలీ ఆఫ్ ప్లవర్స్ గురించి తెలుసుకుందాం.
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్ అద్భుతమైన పూలలోయ హిమాలయాల్లో 3352 నుంచి 3658 మీటర్ల ఎత్తులో ఉంది.ఇది వర్షాకాలంలో సందర్శించడానికి చాలా అద్భుతమైన ప్రదేశం.
ఇక్కడి ప్రకృతి సోయగాలను చూస్తూ మైమరిచి పోవచ్చునంట. చాలా మంచి అనుభూతిని ఈ పూలతోటలు ఇస్తాయంట. మానసిక ఒత్తిడిని దూరం చేసి సంతోషాన్నిస్తాయంట.
అలాగే ఈ అతి సుందరమై పూల సోయగాల లోయ దాదాపు 875 చరదపు కిలోమీటర్ల మేర పూలతో, ప్రకృతిని తనలో దాచుకున్న అదమైన వెన్నెలలా కనిపిస్తుందంట.
ఈ వ్యాలీ ఆఫ్ ప్లవర్స్ లోయకు వెళ్లాలంటే జులై, సెప్టెంబర్ మంచి అనుకూలమైన సమయం. పూల లోయలు, మంచు పర్వతాలు,నదులు, జలపాతాలు వందలాది రకాల పూలు, అరుదైన జంతువులలు ఇక్కడ ఆకట్టుకుంటాయి.