రాత్రి పూట అస్సలే చేయకూడని పనులు ఇవే.. చేశారో ఇక అంతే!

samatha 

10 MAY 2025

Credit: Instagram

వాస్తుశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది మన జీవితంలో కీలక పాత్రపోషిస్తుంది. ఆర్థికపరమైన సమస్యలు తొలిగిపోవాలన్నా వాస్తు టిప్స్ పాటించాల్సిందే.

కానీ కొంత మంది వాస్తు నియమాలను పాటించక చాలా సమస్యలు ఎదుర్కుంటారు. అది వారి జీవితంలో చాలా ఇబ్బందులను తెస్తుంది.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం , రాత్రిపూట పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనుల గురించి కూడా ప్రస్తావించబడింది. మనం రాత్రిపూట ఈ పనులు చేసినప్పుడు, అది చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుందంట .

అలాంటి పనులు చేసే వ్యక్తి   చాలా చెడు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందంట.కాగా, రాత్రిపూట మనం ఎప్పుడూ చేయకూడని ఈ పనుల గురించి తెలుసుకుందాం.

రాత్రిపూట ఎప్పుడూ ఆలస్యంగా తినకూడదు.  మీరు రాత్రి ఆలస్యంగా భోజనం చేసినప్పుడు, మీరు చాలా దురదృష్టకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం, రాత్రి పడుకునేటప్పుడు ఎప్పుడూ ఉత్తరం వైపు తల ఉంచకూడదు. ఈ వైపు తల పెట్టి పడుకున్నప్పుడు, మీరు చాలా ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందంట.

రాత్రిపూట గోర్లు కత్తిరించకూడదు.  రాత్రిపూట గోళ్లు కత్తిరించుకుంటే, అది మీ జీవితంలోకి పేదరికాన్ని తెస్తుంది. ఇది కాకుండా, రాత్రిపూట గోర్లు కత్తిరించే వారిపై లక్ష్మీ దేవి ఎప్పుడూ కోపంగా ఉంటుంది.

అదే విధంగా రాత్రి సమయంలో ఎప్పుడూ తలను దువ్వకూడదంట. జుట్టు విరబోసుకొని ఉండటం కూడా చాలా తప్పు అంటున్నారు నిపుణులు.