భార్యకు భర్త మల్లెపూలు కొనివ్వడం వెనకున్న రహస్యం తెలుసా? 

samatha 

10 MAY 2025

Credit: Instagram

మల్లెపూలు అంటే ఇష్టపడని మహిళలు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మందికి మల్లె పూలంటే చాలా ఇష్టం ఉంటుంది.

ఇక భర్త మల్లె పూలు తీసుకొస్తే ఆ భార్య చాలా సంతోషిస్తుందంట. ఆమె ఆనందానికే అవధులు ఉండవని చెబుతుంటారు. కానీ ఆనందమే కాకుండా బోలేడు ప్రయోజనాలు ఉన్నాయంట

అయితే భార్యకు భర్త మల్లె పూలు తేవడం వలన ఆ భార్య ముఖంలో ఆనందం చూడటమే కాకుండా చాలా లాభాలున్నాయంట. అవి ఏవి అంటే?

మగవారు తమ భార్యకు ప్రతి రోజూ మల్లెపూలు తీసుకెళ్తే చాలా మంచిదంట. దీని వలన ఇంట్లో సంపద రెట్టింపు అవుతుందంట.

ఇంట్లో తగినంత సంపాదన లేకపోయినా, ఉద్యోగ, వ్యాపారల్లో కలిసి రాకపోయినా తప్పకుండా భార్యకు మల్లెపూలు తీసుకెళ్లాలంట.

ప్రతి రోజూ మీ ఇంటి లక్ష్మీ తలలో మల్లెపూలు పెట్టుకొని, లక్ష్మీదేవిలా తయారు అవ్వడం వలన శుక్రుడి అనుగ్రహం కలుగుతుందంట.

శుక్రుడి అనుగ్రహం వలన ఇంట్లో, ఉద్యోగంలో, వ్యాపారల్లో కలిసి వస్తుందంట. అందుకే తప్పకుండా భార్యకు భర్త మల్లె పూలు తీసుకెళ్లాలి అంటున్నాయి శాస్త్రాలు.

అయితే ఈ కాలంలో చాలా మంది భార్య ఆనందం కోసం పూలు తీసుకెళ్తుంటారు అనుకుంటున్నారు. కానీ దీని వెనుకున్న అసలు రహస్యం ఇదంట.