సమ్మర్‌లో జలుబు ఎందుకు అవుతుందో తెలుసా? కారణాలు ఇవే

samatha 

10 MAY 2025

Credit: Instagram

చాలా వరకు వర్షాకాలం లేదా చలికాలంలో  చాలా మందికి జలుబు అవుతుంటుంది. కానీ కొందరికి వేసవిలో కూడా జలుబు చేస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.

అయితే వేసవిలో కూడా జలుబు రావడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు అవి ఏవో తెలుసుకుందాం.

వేసవిలో జలుబు రావడానికి ముఖ్యకారణం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం. ఎవరిలోనోనైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వారికి వేసవిలో జలుబు అవుతదంట.

సమ్మర్‌లో జలుబు రావడానికి వడగాలులు కూడా ఓ కారణం అంట.  ఎండాకాలంలో విపరీతంగా గాలులు వీస్తాయి. ఆ సమయంలో వచ్చే దుమ్ము ధూళి వలన జలుబు అవుతుంది.

సమ్మర్ లో చెట్ల నుంచి ఒక రకమైన పుప్పొడి రాలుతుంది. దానిని పీల్చడం వలన కూడా వేసవి కాలంలో జలుబు అవుతుందంటున్నారు నిపుణులు.

అదే విధంగా సమ్మర్‌లో ఎండ వేడిని తాళలేక చాలా మంది కూల్ వాటర్ తాగడం, ఐస్ క్రీమ్స్ ఎక్కువ సేపు కూలర్ లేదా ఏసీ కింద ఉండటం వలన జలుబు అవుతుందంట.

వేసవిలో చాలా వరకు జలుబు దగ్గు రావడానికి అసలు కారణం అలర్జీ, వైరస్ సంక్రమణం వలన చాలా మందికి జలుబు వస్తుంటుంది.