మీరో రోజూ 8 గంటలు నిద్రపోవడం లేదా? అయితే ఇది తెలుసుకోండి!

Samatha

30 october 2025

నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రతి రోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని చెబుతుంటారు.

కానీ కొంత మంది వర్క్ బిజీ, లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది కనీసం ఆరుగంటలు కూడా సరిగ్గా నిద్రపోవడం లేదు. కానీ దీని వలన అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదంట.

ఎవరైతే ప్రతి రోజూ కనీసం 8 గంటలు నిద్రించరో వారిలో శక్తి స్థాయిలు తగ్గడమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుందంట. తీవ్రమైన అలసట ఉంటుంది.

ఎవరైతే 8 గంటలు నిద్రించరో,వారి శక్తి పూర్తిగా తగ్గిపోయి, నిరుత్సాహంగా అనిపించడం, ఎక్కువగా కెఫిన్ పై ఆధారపడటం జరుగుతుందంట. అంతే కాకుండా వర్క్ కూడా చేయలేరంట.

నిద్రలేమి చాలా ప్రమాదకరం అయినది, అందువలన ఎవరైతే సరిగ్గా కంటినిండా నిద్రపోరో, వారిలో ఏకాగ్రత లోపించడం, జ్ఞాపక శక్తి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుందంట.

8గంటలు నిద్రపోని వారిలో బలహీనమైన రోగనిరోధక శక్తి ఉండటమే కాకుండా, ఇది శరీరం ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే కణాలను తక్కువ ఉత్పత్తి చేసి, అనారోగ్య సమస్యలను ప్రేరేపిస్తుందంట.

ఎవరైతే సరిగ్గా నిద్రపోరో, వారిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందంట. నిద్ర లేకపోవడం భావోద్వేగ నియంత్రణను ప్రభావితం చేస్తుంది, దీని వలన ఆందోళన, ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందంట.

నిద్రలేమి బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. ఇది ఆకలి హార్మోన్లను దెబ్బతీస్తుంది, దీని వలన అతిగా ఆకలి అవ్వడం, అతిగా తినడం వలన బరువు పెరగడం జరుగుతుందంట