సిగరెట్ తాగుతూ టీ తాగుతున్నారా.. ఆ ముప్పు తప్పదు!

samatha 

13 MAY 2025

Credit: Instagram

చాలా మంది తల నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి టీ తాగుతుంటారు. తప్పకుండా రోజులో ఒక్కసారైనా టీ తాగకుండా ఉండలేరు.

ఇక ఆఫీసుల్లో పని చేసే వారు కనీసం రోజుకు రెండు లేదా మూడు సార్లైనా టీ తాగడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.కానీ కొంత మంది మాత్రం టీతో పాటు సిగరెట్ తాగుతుంటారు.

నైట్ షిఫ్ట్ లేదా వర్క్ చేసే వారు చాలా మంది సిగరెట్ తాగుతూ టీ కూడా తాగుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు నిపుణులు.

సిగరెట్ తాగుతూ టీ తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉన్నదంట. కాగా దీని వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

టీ తాగుతూ సిగరెట్ తాగడం వలన రక్తనాళాలు సంకోచించి రక్తపోటు పెరిగి గుండె పోటు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నదంట. అంతే కాకుండా ఇది జీర్ణ వ్యవస్థ పై కూడా ప్రభావం చూపిస్తుందంట.

సిగరెట్, టీ కలిపి తాగడం వల్ల కడుపు సమస్యలు కూడా వస్తాయంట. అజీర్తి, కడుపులో మంట, కడుపు నొప్పి, మలబద్ధకం, అల్సర్స్ వంటి జీర్ణవ్యవస్థ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

అంతే కాకుండా ఈ అలవాటు ఊపిరితిత్తులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.ఊపిరితిత్తుల క్యాన్సర్, అస్తమా, నిద్రలేమి సమస్యలు, మానసిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నదంట.

టీ, సిగరెట్లను కలిపి తాగడం వల్ల గుండె జబ్బు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.అందువలన ఈ అలవాటు మానుకోవాలంట.