శ్రీకృష్ణుడు స్నానం చేయడానికి వెళ్లే ఈ జలపాతం గురించి తెలుసా?టూర్‌కు బెస్ట్ ప్లేస్!
samatha
12 MAY 2025
Credit: Instagram
సమ్మర్ వచ్చేసింది. సూర్యుడు తన భగ భగలతో చుక్కలు చూపిస్తున్నాడు. దీంతో చాలా మంది చల్లటి ప్రదేశాలకు వెకేషన్ వెళ్లడానికి ఆలోచిస్తుంటారు.
ఇంక కొంత మంది అందమైన నదులు, జలపాతాలు, అడవుల మధ్య ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి వారికే ఈ అద్భుతమైన సమాచారం.
చాలా మందికి తెలియని బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌లలో బీహార్‌లోని నవాడ జిల్లాలో ఉన్న కాకోలాట్ జలపాతం ఒకటి. ఇది చాలా అద్భుతమైన ప్రదేశం.
అక్కడి అద్భుతమైన ప్రకృతిని చూస్తే మైమరిచి పోవడం ఖాయం. ఇది నవాడ నుంచి దాదాపు 34 కిలో మీటర్ల దూరంలో బీహార్, జార్ఖండ్ సరిహద్దులో ఉంటుంది
ఈ అత్యంత సుందరమైన జలపాతం నీరు భూమికి దాదాపు 150 నుంచి 160 అడుగుల ఎత్తు నుంచి సరస్సులోకి స్తుందంట. అంతే కాకుండా నీటి చప్పుడు కూడా మువ్వలు మోగినట్లు చాలా బాగుంటుంది.
అంతే కాకుండా,ఇక్కడి చుట్టూ ఉన్న పచ్చని చెట్లు, చాలా చల్లటి ప్రదేశం చాలా బాగుంటుందంట. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుందంట.
ఇక భారత దేశంలో అత్యుత్తమ జలపాతాల్లో ఒకటిగా కొనసాగుతున్న ఈ జలపాతం ఏడాది పొడవునా నీటి ప్రవాహంతో చాలా చల్లగా ఉంటుందంట. అంతే కాకుండా ఇక్కడ జాతర కూడా నిర్వహిస్తారంట.
ఎందుకంటే ఈ సరస్సు కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. అది కృష్ణుడు ఈ జలపాతం వద్దకే స్నానం చేయడానికి వచ్చే వాడంట. అందుకే దీనికి ప్రత్యేకత ఉంటుంది.