సద్గురు ఆరోగ్య చిట్కాలు.. ఎండకాలం కదా అని పదే పదే చల్లటి నీరు తాగుతున్నారా?

samatha 

10 MAY 2025

Credit: Instagram

సమ్మర్ వస్తే చాలు చాలా మంది చల్లటి నీరు తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. కానీ దాని వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంట.

అతి చల్లటి నీరు తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి అంటున్నాడు సద్గురు బాబా. ఆయన ఏం చెప్పారంటే?

చాలా చల్లటి నీరు కడుపులోకి ప్రవేశించడం వల్ల  జీర్ణశక్తి మందగిస్తుందంట. దీని వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.

చల్లటి నీరు తాగినప్పుడు, శరీరంలోని రక్త నాళాలు కుంచించుకుపోవడం ప్రారంభిస్తాయి, ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుందంట.

అతి చల్లటి నీరు తాగడం వల్ల గొంతు సమస్యలు వస్తాయంటున్నారు సద్గురు బాబా. గొంతు నొప్పి, వాపు , జలుబు వంటివి వేధిస్తాయంట.

శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా పడిపోయినప్పుడు, జీవక్రియ మందగిస్తుంది, ఇది బరువు పెరిగే అవకాశాలను కూడా పెంచుతుంది.

చాలా చల్లటి నీరు అకస్మాత్తుగా శరీరంలోకి ప్రవేశించినప్పుడు, ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది, ఇది దానిపై ఒత్తిడిని పెంచుతుందంట.

వేసవిలో చల్లటి నీరు ఖచ్చితంగా ఉపశమనాన్ని అందిస్తుంది, కానీ అది దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు సద్గురు