ఈ ముద్దుగుమ్మ అందానికి హద్దే లేదా.. లెహంగాలో అందంగా శోభా శెట్టి!
samatha
10 MAY 2025
Credit: Instagram
కన్నడ ముద్దుగుమ్మ శోభ శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్నడ బ్యూటీ అయినా తెలుగు అమ్మాయిలా తెలుగు చక్కగా మాట్లాడుతూ.. తన నటనతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది ఈ చిన్నది.
బుల్లితెరపై తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతే కాకుండా బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
కార్తీక దీపం ఫేమ్ మోనిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. కార్తీక దీపం సీరియల్‌లో మోనిత పాత్రలో, తన విలనిజంతో అందరినీ ఆకట్టుకుంది ఈ చిన్నది.
బిగ్ బాస్‌కు వెళ్లిన తర్వాత శోభ శెట్టి మరింత పాపులారిటీ సంపాదించిందనే చెప్పాలి. సీరియల్‌లోనే కాకుండా, హౌస్‌లో కూడా తన విలనిజం చూపిస్తూ తన మార్క్ చూపెట్టింది.
తెలుగులోనే కాకుండా ఈ బ్యూటీ కన్నడ బిగ్ బాస్‌కు వెళ్లి కూడా అక్కడ తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుందంట ఈ అందాల ముద్దుగుమ్మ.
కానీ కన్నడ బిగ్ బాస్‌లోకి వెళ్లిన తర్వాత అనారోగ్యం కారణంతో మధ్యలోనే సెల్ఫ్ ఎలిమినెట్ అయ్యి బయటకు వచ్చినట్లు సమాచారం.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన ఇన్ స్టాలో పలు ఫొటోలను షేర్ చేసింది.ఇందులో శోభ శెట్టి ఎల్లో లెహెంగాలో సిగ్గుపడుతూ కనిపించింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి తన ఫ్యాన్స్ బ్యూటిఫుల్ మోనితా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.