కాలేయం, కిడ్నీల ఆరోగ్యానికి ఐదు బెస్ట్ ఫుడ్స్ ఇవే!
samatha
12 MAY 2025
Credit: Instagram
శరీరంలో కాలేయం, కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇవి మన శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించి ఆరోగ్యాన్ని కాపాడుంతాయి.
అందువలన కాలేయం, కిడ్నీల ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని రకాల ఫుడ్ మీ డైట్‌లో చేర్చుకోవాలంట. అవి ఏవి అంటే?
సోంపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. అందువలన వీటిని కనీసం రోజులో కొంచెం తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.
సోంపు గింజలు కాలేయం, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్రపోషిస్తాయంట. శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకు పంపిస్తుందంట
అదే విధంగా పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అయితే దీనిని మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చేసి కాలేయపనితీరును మెరుగుపరుస్తుందంట.
గోరు వెచ్చటి పసు నీటిని 30 సెకన్ల పాటు నోటిలో వేసుకొని ఉమ్మి వేయాలంట. దీని వలన ఇది గొంతులో ఉన్న బ్యాక్టీరియాను బయటకు పంపడమే కాకుండా కాలేయాన్ని శుభ్రంచేస్తుంది.
ఆముదం నూనె గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇది కాలేయ పనితీరును మెరుగు పరుస్తుంది. అందువలన దీనిని కూడా మీ డైట్‌లో చేర్చుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.