ఏలినాటి శని నుంచి ఉపశమనం పొందాలా.. ఈ పరిహారలు చేయాల్సిందే!
samatha
12 MAY 2025
Credit: Instagram
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో చంద్రుని నుంచి పన్నెండవ, అలాగే మొదటి, రెండవ ఇళ్లలో శని సంచరిస్తే దానిని ఏలినాటి శని అంటారు.
దీని ప్రభావం దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. ఇది జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యం, సంపద, సంబంధాలు, కెరీర్ పై దీని ప్రభావం ఉంటుంది.
అయితే ఈ సంవత్సరం శని దేవుడు మార్చి 29న కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని వలన ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం.
మేష రాశి :జూలై నుంచి ఈ రాశి వారికి చాలా సమస్యలు వస్తాయి, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కుంభ రాశి : వీరికి దీర్ఘకాలిక ఒత్తిడిల నుంచి బయటపడవచ్చు. వ్యాపారంలో పుంజుకుంటారు, ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. ఆనందంగా గడుపుతారు.
మీన రాశి వారికి రెండో దశలో కొన్ని ఆర్థిక నష్టాలు ఉన్నాయి.ఒత్తిడి అధికంగా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
ఏలినాటి శని ఉన్నవారు శని వారాలలో రావి చెట్టుకు నీళ్లు పోసి ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రతి రోజూ శని దేవుని స్తోత్రాలు పాటించాలి.
హనుమాన్ చాలీసా పఠించాలి. నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు, నువ్వుల నూనె దానం చేయాలి. ఇనుప ఉంగరం ధరించాలంట. దీని వలన ఉపశమనం కలుగుతుంది.