ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!

Samatha

29 November 2025

టీ అంటే చాలా మందికి ఇష్టం. అందువలన ఉదయం లేచిందంటే చాలు ఖాళీ కడుపుతో టీ తాగుతుంటారు. కానీ ఇలా ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిది కాదంట.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టు ముడుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

కాగా, మార్నింగ్ లేవగానే ఖాళీ కుడుపుతో టీ తాగడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన కడుపులో ఆమ్లత్వం పెరిగి అజీర్ణం, కడుపు ఉబ్బరం గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదంట.

ముఖ్యంగా టీలో ఉండే ఆమ్లత్వం ఖాళీ కడుపుతో టీ తాగడం వలన ఇది జీర్ణ సమస్యలను పెంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అలాగే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన ఇది శరీరంలో పోషకాలను గ్రహించే, సామర్థ్యాన్ని తగ్గిస్తుందంట. దీని వలన శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగ్గా అందవు.

అదే విధంగా ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వలన ఇది డీ హైడ్రేషన్‌కు కారణం అవుతుంది. తల తిరగడం వంటి సమస్యలు ఎదురు అవుతాయి.

అందువలన ఎట్టి పరిస్థితుల్లోఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు, టీతాగడానికి ముందు తప్పకుండా ఏదైనా తినాలంట.