కొత్తగా పెళ్లైందా.. ఈ విషయాల్లో జాగ్రత్త పడాల్సిందే!
samatha
13 MAY 2025
Credit: Instagram
పెళ్లీల సీజన్ మందలైంది. చాలా మంది పెళ్లికి రెడీ అయిపోయారు. మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.
అయితే కొత్తగా పెళ్లైన తర్వాత అత్తవారిల్లు , కొత్త మనుషులు, విభిన్న మనస్తత్వాల మధ్య మెదులుకోవడం అనేది చాలా కష్టం.
దీంతో కొంత మంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అందువలన కొత్తగా పెళ్లైన తర్వాత అస్సలే చేయకూడని కొన్ని తప్పులు ఏవో ఇప్పుడు చూద్దాం.
కొత్తగా పెళ్లైన తర్వాత ఇరుగు పొరుగు వారు చాలా సలహాలు ఇస్తుంటారు. వాటిని వినాలి కానీ అందులో కొన్ని వదిలేయాలి. ప్రతీది పట్టించుకుంటే సంబంధం దెబ్బతింటుంది.
అలాగే పెళ్లైన తర్వాత ఇల్లు బాధ్యత, నా భర్త బాధ్యత నాదే అన్నట్లు అంత త్వరగా మీ పెత్తనం ఆశించకండి. సమయం బట్టి మెదలాలి. అదే బంధానికి పునాది.
చాలా వరకు పెళ్లైన తర్వాత భర్త గురించి పూర్తిగా తెలియదు. కాబట్టి మీ భాగస్వామి గురించి తెలుసుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూడకుండా, ఇద్దరి అభిరుచుల గురించి తెలుసుకోవాలి.
అలాగే ఎదుటి వారితో మీ బంధాన్ని ఎప్పుడూ పోల్చుకోకూడదు. అది మీ బంధాన్ని దూరం చేయవచ్చు. అందుకే తన భార్య బాగుంది అది ఇది అని పోలికలు అస్సలే చేసుకోకూడదు.
అదే విధంగా కొంత మంది వివాహమైన తర్వాత తనను తాను పూర్తిగా కోల్పోతారు. అస్సలే అలా చేయకూడదు. మీ డ్రీమ్ ఏంటో దానిపై ఫోకస్ చేయాలి.