టీ అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. అందుకే కనీసం రోజుకు రెండు సార్లైనా చాలా ఇష్టంగా టీ తాగుతుంటారు. ముఖ్యంగా తలనొప్పి నుంచి ఉపశమనం కోసం టీ తాగుతారు.
అయితే టీలో చాలా మంది బిస్కెట్స్, రస్క్, బ్రెడ్ వంటి చాలా వాటిని టీతో కలిపి తింటారు. అయితే టీ తిన్న తర్వాత అస్సలే కొన్ని పదార్థాలు తీసుకోకూడదంట. అవి
టీ తాగిన తర్వాత అస్సలే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడంట. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టీ తాగిన తర్వాత పండ్లు అస్సలే తినకూడదంట. టీలో ఉండే టానిన్లు పండ్లలోని పోషకాలను శరీరం గ్రహించకుండా చేయడమే కాకుండా, గ్యాస్ ఎసిడిటీ సమస్యకు కారణం అవుతుందంట.
టీ తాగిన తర్వాత అస్సలే చల్లటి వస్తువులు, కూల్ డ్రింక్స్ , ఐస్ క్రీమ్స్ అస్సలే తినకూడదంట. దీని వలన జీర్ణ వ్యవస్థ సక్రమంగా సాగదు.
టీ తాగిన వెంటనే అస్సలే మంచినీరు తాగకూడదంట. దీని వలన దంతాల సమస్యలు, జీర్ణసమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు నిపుణులు.
టీ తాగిన తర్వాత నెయ్యి, పెరుగు, మజ్జిగ, పాలకు సంబంధించిన స్వీట్స్ అస్సలే తినకూడదంట. ఇది కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుందంట.
టీ తాగిన తర్వాత అస్సలే బెల్లంతో చేసిన ఆహారాలు, బెల్లం తినకూడదంట. ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అంటున్నారు నిపుణులు.