నాన్నకు ప్రేమతో.. ఈ కొటేషన్స్‌తో మీ డాడీపై ఉన్న ప్రేమను తెలపండి!

samatha 

15 JUN  2025

Credit: Instagram

నాన్న అంటే ప్రతి ఒక్కరికీ అమితమైన ప్రేమ ఉంటుంది. తన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి రాత్రింభవల్లు కష్టపడుతాడు నాన్న.

కొన్ని సార్లు కోపం చూపించినా, అది తన పిల్లల భవిష్యత్తుకోసమే తప్ప వారిపై తండ్రికి ఎలాంటి ద్వేషం, కోపం అనేవి ఉండవు.

ఎందుకంటే? తండ్రి అనే వ్యక్తి తన ప్రేమను దాచి, పిల్లల భవిష్యత్తుకోసం తెగ ఆరాటపడుతుంటాడు. తన రెక్కల కష్టాన్నే నమ్ముకుంటాడు.

అందుకే తండ్రి రుణాన్ని తీర్చుకోవడానికి ఈ ప్రపంచంలో మరేదీలేదు. కాబట్టి ఆయనకు ఈ కొటేషన్స్ ద్వారా కృతజ్ఞలు చెప్పండి.

నా జీవితంలో నువ్వే నా హీరో డాడీ.. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను హ్యాపీఫాదర్స్ డే నాన్న.. ఐ లవ్ యూ

నాన్నగా నువ్వు ఉన్నప్పుడు నాకు నీ విలువ తెలియలేదు. కానీ నువ్వు దూరమయ్యాక ఆ విలువ నాకు తెలుస్తుంది.  మిస్​ యూ నాన్న.

నేను తండ్రిగా మారాక తెలిస్తోంది. నాకోసం నువ్వు ఎన్ని త్యాగాలు చేశావో అని. ఇకపై నీకు కూడా నేను నాన్న అవుతానని ప్రామిస్ చేస్తున్నా..

ఎవరూ ఊహించలేని ఒక ప్రమాణాన్ని మీరు ఏర్పరిచారు. నేను ఎల్లప్పుడూ మీలాగే గొప్పగా ఉండటానికి ప్రయత్నిస్తాను, నాన్న.