పసుపు కలిపిన పాలు ఎవరు తాగకూడదో తెలుసా?

samatha 

13  JUN  2025

Credit: Instagram

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. మరీ ముఖ్యంగా పసుపు కలిపిన పాలు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు ఆరోగ్య నిపుణులు.

 పసుపు కలిపిన పాలు తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే చాలా మంది పసుపు పాలు తాగడానికి ఆసక్తి కనబరుస్తారు.

అయితే ఈ పసుపు పాలకు కొంత మంది మాత్రం తప్పకుండా దూరంగా ఉండాలంట. లేకపోతే సమస్యల్లో పడే చాన్స్ ఉంటుందంట.

ఇంతకీ పసుపు కలిపిన పాలు ఎవరు తాగకూడదు, ఎవరు ఈ పాలను తాగడం వలన వారి ఆరోగ్యం దెబ్బతింటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరికైతే స్కిన్ ఎలర్జీ ఉందో వారు పసుపు పాలకు దూరం ఉండాలంట. లేకపోతే సమస్య మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందంటున్నారు వైద్యులు.

అలాగే కొంత మందికి పదే పదే కడుపు నొప్పి వస్తుంటుంది. అయితే అలాంటి వారు కూడా పసుపు పాలను తాగకూడదంట. ఇందులో ఉండే కర్ క్యూమిన్ ఈ సమస్యను తీవ్రతరం చేస్తుంది.

కొంత మందికి వికారం,వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. ఈ సమస్యతో బాధపడే వారు కూడా పసుపు పాలను ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదంట.

ఇవే కాదు కడుపు సంబంధమైన సమస్యలు, పిత్త దోషం సమస్య ఉన్నవారు కూడా పసుపు పాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.