వర్షకాలంలో ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడటానికి తాగాల్సిన బెస్ట్ డ్రింక్స్ ఇవే!
samatha
12 JUN 2025
Credit: Instagram
వర్షకాలంలో అల్లం టీ లేదా అల్లంతో కలిపిన డ్రింక్స్ తాగడం శరీరానికి చాలా మంచిదంట. ఎందుకంటే అల్లంలోశ్వాసకోశ, వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అంతే కాకుండా వర్షకాలంలో ప్రతి ఒక్కరి శరీరం అనేది చాలా చల్లగా ఉంటుంది. అయితే అల్లంతో చేసిన డ్రింక్స్ తాగడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
కొంత మంది వర్షకాలంలో తల నొప్పి, గొంతు సమస్యలతో సతమతం అవుతుంటారు. అయితే అలాంటి వారు టీలో అల్లం వేసుకొని తాగడం మంచి ఎంపిక.
తులసి శరీరానికి చాలా మంచిది. ఇది యాంటీబయోటిక్‌గా కూడా పని చేస్తుంది. అందువలన వర్షకాలంలో వచ్చే వ్యాధులనుంచి బయటపడాలి అంటే ప్రతి రోజూ ఉదయం తులసి టీ తాగాలంట.
ఎందుకంటే తులసి ఆకుల రసం, రోగనిరోధక శక్తిని పెంచి, మన శరీరాన్ని రీ ఫ్రెష్ చేస్తాయి. అందుకే తులసి ఆకులను నీటిలో మరిగించి టీ చేసుకొని తాగడం చాలా మంచిదంట.
పసుపులో కర్కుమిని పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని రక్షించడానికి, యాంటీ వైరల్ , యాంటీ బ్యాక్టీరియల్‌గా పని చేస్తుంది.
అందువలన పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చటి పాలలో, చిటికెడు పసుపు వేసుకొని తాగడం లేదా టీలో పసుపు వేసుకోవడం శరీరానికి చాలా మంచిది.
రోజంతా ఉత్తేజంగా ఉండటానికి అదే విధంగా రోగనిరోధక శక్తిపెంచుకోవడానికి తిప్పతీగ రసం తీసకోవడం చాలా మంచి ఎంపిక. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
వర్షకాలంలో వచ్చే జలుబు, తగ్గు, గొంతు నొప్పి సమస్యలకు బెస్ట్ మెడిసన్ దాల్చిన చెక్కటీ. దీనిని తీసుకోవడం వలన జీర్ణక్రియను మెరుగు పరిచి, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.