బ్యాంక్ లాకర్‌లో గోల్డ్ పెట్టడం భద్రమేనా? ఎప్పుడైనా ఆలోచించారా?
samatha
12 JUN 2025
Credit: Instagram
ప్రస్తుతం బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గోల్డ్ రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది.
దీంతో బంగారం కొనడమే కాదు, దాచుకోవడం కూడా చాలా పెద్ద సవాల్‌గా మారింది. అందుకే చాలా మంది బంగారాన్ని లాకర్ లో పెట్టుకుంటారు.
మరీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు బంగారం లాకర్లో పెట్టడం మంచిదేనా? ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో..
కాగా, ఇప్పుడు మనం బ్యాంకు లాకర్లో డబ్బులు పెట్టడం, దీనిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకుందాం.
గతంలో లాకర్‌లో ఉన్న వస్తువులకు బ్యాంకులు బాధ్యత వహించేవి కావు. కానీ RBI 2021లో చేసిన మార్పుల నుంచి లాకర్లపై బాధ్యత తీసుకుంటుంది.
అయితే నిర్లక్ష్యం వలన జరిగితే బ్యాంకు బాధ్యత వహిస్తుందికానీ, సునామీలు, తుఫానుల వంటి వాటి వలన నష్టం జరిగితే వాటికి బ్యాంకు బాధ్యత వహించదు.
అయితే ఎవరైనా సరే గోల్డ్ లాకర్లో పెట్టే ముందు గైడ్ లైన్స్ చదువుకోవాలంట. అంతేకాకుండా, మీ బంగారానికి సంబంధించిన ఫొటోలు,ఒప్పందపు పత్రం, లాకర్ ఫొటో తీసుకోవాలంట.
అదే విధంగా, ఎప్పుడైనా సరే లాకర్లో బంగారం పెట్టే ముందు తప్పకుండా మీరు లాకర్ రెంట్ 100 సార్లు కట్టగా ఎంత ఖర్చు అవుతుందో అంతే లేదా అంత కంటే తక్కువ బంగారాన్ని లాకర్లో పెట్టుకోవాలంట.