పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. చాలా మంది పాములను చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు. కొంత మంది కనీసం దూరం నంచి చూడటానికి కూడా భయపడిపోతారు.
అయితే పాములు అనేవి అనేక రకాలు ఉంటాయి. కొన్ని సముద్రాలు, అడువుల్లో ఉంటే మరికొన్ని జననివాసాల్లో తిరుగుతుంటాయి. అయితే ఎప్పుడైనా సరే పాము ముందుకే పాకుతుంది.
మీరు ఎప్పుడైనా గమనించారా? ఏ పాము అయినా సరే ముందుకే పాకుతుంది. మరి అసలు పాములు ఎందుకు వెనక్కిపాకలేవో ఎప్పుడైనా ఆలోచించారా. దాని గురించి తెలుసుకుందాం.
పాములకు ఉండే వెంటర్రల్ స్కేల్స్ అనేవి ముందుకు నడవడానికి తప్ప అవి వెనక్కి వెళ్లేందుక అడ్డంకిగా ఉంటాయంట. అవి వెనక్కువెళ్లడానికి సహాయపడవంట.
పాములు తమ శరీరాన్ని అలలా వంచి ముందుకు కదలడం మాత్రమే చేయగలవు కానీ, అవి వెనక్కి వెళ్లలేవు అంటున్నారు నిపుణులు.
ఎందుకంటే పాములకు కాళ్లు అనేవి ఉండవు. అందువలన వాటికి కాళ్లు లేవు కాబట్టి కదలిక ఉండదు. దాని శరీర పొలుసులతోనే అది ముదుకు కదలగలుగుతుందంట.
అందుకే దాని శరీర నిర్మాణం వలన అది ముందుకు మాత్రమే సాగుతుంది. కానీ కొన్ని ఇరుకు అయిన ప్రదేశాల్లో మాత్రం అది కాస్త వెనక్కి సాగుతుందంట.