చలికాలంలో చర్మం మెరిసిపోవాలా?

Samatha

24 November 2025

అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరూ సీజన్ ఏదైనా సరే అందంగా, మెరిసి పోవాలి అనుకుంటారు. కానీ కొందరికి మాత్రమే అది సాధ్యం అవుతుంది.

మరీ ముఖ్యంగా చలికాలం వస్తే చాలు, ముఖం జిడ్డుగా తయారు అవుతుంది. చర్మం పొడిబారడం వంటి సమస్యలు అధికం అవుతుంటాయి.

వాతావరణం చాలా తేమగా ఉండటం వలన ఎక్కువగా నీరు తాగరు. అందువలన శరీరం డీ హైడ్రేషన్‌కు గురి అయ్యి, చర్మం పొడిబారండం, పెదవులు, ముఖం పై పగుళ్లు ఏర్పడుతుంటాయి.

అయితే ఇలాంటి సమయంలో ముఖానికి రోజ్ వాటర్ రాయడం వలన చర్మం మృధువుగా అందంగా తయారు అవుతుందని చెబుతున్నారు నిపుణులు.

ప్రతి రోజూ క్రమం తప్పకుండా రోజ్ వాటర్ ముఖానికి అప్లే చేయడం వలన ఇది ముఖానికి సహజమైన రంగును ఇవ్వడమే కాకుండా, చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుందంట.

చాలా మంది ఎక్కువగా చలికాలంలో చర్మం ఎర్ర బడటం, దురద వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే రోజూ రోజ్ వాటర్ అప్లే చేయడం వలన ఈ సమస్యలు తగ్గిపోతాయంట.

చర్మంపై పగుళ్లు ఏర్పడి, రంధ్రాలుగా ఏర్పడుతుంటుంది, వాటిలో దుమ్ము, ధూళి పేరుకపోయి, చికాకును కలిగిస్తుంది. ఈ సమయంలో రోజ్ వాటర్ అప్లై చేయడం వలన ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుందంట.

అదే విధంగా చలికాలంలో రోజ్ వాటర్ చర్మానికి అప్లే చేసుకోవడం వలన ఇది సహజ మెరుపుని ఇవ్వడమే కాకుండా చర్మం మృధువుగా అయ్యేలా చేస్తుందంట.