చలికాలంలో వెచ్చగా ఉండాలా.. అయితే తప్పక డ్రై ఫ్రూట్స్ తినాల్సిందే!

Samatha

25 November 2025

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని ఏ సీజన్‌లో తిన్నా శరీరానికి చాలా మేలు చేస్తాయి. అలాగే చలికాలంలో వీటిని తినడం వలన మరింత ప్రయోజనం చేకూరనున్నదంట.

చలికాలం వచ్చిందంటే చాలు, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. చర్మ సమస్యలు ఎక్కువ అవుతాయి. అయితే వీటన్నింటి నుంచి ఉపశమనం పొందాలి అంటే తప్పకుండా డ్రై ఫ్రూట్స్ తినాలంట.

ఇందులో ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి. అందువలన ప్రతి రోజూ డ్రై ఫ్రూట్స్ తినడ వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చలికాలంలో బాదం తినడం వలన ఇందులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచి, బరువు తగ్గడానికి సహాయపడతాయి.

శీతాకాలంలో ఖర్జూర శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్స్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయంట.

చలికాలంలో జీడిపప్పు తినడం వలన ఇందులో ఉండే మంచి కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెకు మేలు చేస్తుంది. అలాగే ఇవి మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయట.

చలికాలంలో తినడానికి వాల్ నట్స్ సూపర్ ఫుడ్ అని చెప్పాలి. వీటిని ప్రతి రోజూ తినడం వలన ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తాయి.

అంజీర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎముకల బలానికి కూడా దోహదం చేస్తాయి