తమల పాకులు ఆరోగ్యానికి చాలా మంచివి అంటారు. ముఖ్యంగా వీటిని ప్రతి రోజూ తినడం వలన ఆరోగ్యం పరంగా ఎన్నో లాభాలు ఉన్నాయంట. అవి ఏవి అంటే?
తమలపాకులు హెల్త్‌కి చాలా మంచివి. వీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే చాలా కాలంగా పెద్దవారు వీటిని తింటుంటారు. ఆయుర్వేదంలో కూడా దీని గురించి తెలిపారు.
అయితే ప్రతి రోజూ తప్పకుండా ఒక తమలపాకు తినాలంట. ఎందుకంటే దీనిలో శరీరానికి మేలు చేసే కాల్షియం, విటమన్ సి, కెరోటిన్, నియాసిన్ వంటివి అనేకం ఉన్నాయంట.
ఇవే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్, రిబోప్లేవిన్, క్లోరోఫిల్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అదువలన వీటిని ప్రతి రోజూ తీసుకుంటే శ్వాస సంబంధ సమస్యలు దూరమవుతాయి.
అలాగే తమల పాకులను రోజూ తీసుకోవడం వలన నాడీవ్యవస్థను మెరుగు పరిచి, నాడీ సంబంధిత సమస్యలను దూరం చేస్తుందంట.
తమల పాకులు నమలడం వలన ఆలోచిచే శక్తి పెరుగుతుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎసిడిటీ సమస్యలు దూరమవుతాయి.
తిన్న తర్వాత తమలపాకులను నమలడం వలన అది కడుపులోని బ్యాక్టీరియాను బయటకు పంపి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. టాక్సిన్లు బయటకు పంపుతది.
తమల పాకులు నోట బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. అలాగే ఉబ్బసం,గొంతు నొప్పి, జలుబు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు కూడా ఇది దివ్యఔషధంలా పని చేస్తుంది.