బంతి పువ్వు టీ.. రోజూ తాగితే నమ్మ లేనన్ని ప్రయోజనాలు!

Samatha

25 November 2025

ప్రతి రోజూ అందరూ టీ తాగడం కామన్. ఇక కొందరు గ్రీన్ టీ మరికొందరు రోజ్ వాటర్ టీ ఇలా రక రకాల టీలు తాగుతుంటారు.

అయితే ఇవే కాదండోయ్, బంతిపూల టీ తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంట. దీనిని ప్రతి రోజూ కప్పు తాగడం వలన అనేక లాభాలు ఉన్నాయంట.

బంతి పువ్వు టీ మంచి సువాసనను ఇస్తూ, మనసును, శరీరాన్ని రీఫ్రెష్ చేస్తుంది. అంతే కాకుండా ఇది మంచి విశ్రాంతిని ఇస్తుందంట. అందుకే ప్రతి రోజూ తప్పకుండా కప్పు బంతి పువ్వు టీ తాగాలంట.

కనీసం వారంలో ఒక్కసారైనా సరే బంతి పువ్వు టీ తాగడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.

రోజూ కప్పు బంతి పువ్వు టీ తాగడం వలన ఇది మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించి, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

అలాగే బంతి పువ్వు టీ తాగడం వలన ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సంబంధ సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది.

బంతి పువ్వు టీ ప్రతి రోజూ తాగడం వలన ఇది శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరిచి, శరీరంలోని విషాన్ని బయటకు పంపుతుంది. లివర్ , కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది

అయితే ఈ టీనీ, నీటిలో రెండు స్పూన్ల బంతి పువ్వు రేకులను వేసి, ఐదు నిమిషాల తర్వాత అందులో చిటికెడు తేనె వేసి, మరో ఐదు నిమిషాలు మరగబెట్టాలి. తర్వాత వడగట్టి తాగితే అదిరిపోతుంది.