ఆయుర్వేద రారాజు అశ్వగంధ ఉంటే.. డాక్టరే అవసరం లేదు!
Jyothi Gadda
26 May 2025
భారతదేశంలో ప్రాచీనకాలం నుండి ఉపయోగిస్తున్న ఒక గొప్ప ఔషధ మొక్క అశ్వగంధ. ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఇది సంజీవని వంటిది. ఎన్నో రోగాలను నయం చేస్తుంది.
శక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతని పెంచుతుంది. శారీరక పనితీరుని మెరుగుపరచడం నుంచి నిద్రసమస్యల్ని దూరం చేసేవరకూ చాలా లాభాలు ఉన్నాయి.
ఇందులో కార్టిసాల్ స్థాయిలను తగ్గించే, ఒత్తిడి, ఆందోళనని తగ్గించే అడాప్టోజెనిక్ లక్షణాలను కలిగి ఉంది. ఒత్తిడి సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. మానసిక సమస్యల్ని తరిమేస్తుంది.
అశ్వగంధలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలో మంటని తగ్గిస్తుంది. ఇది ఆర్థరైటిస్, ఇతర ఇన్‌ఫ్లమేటరీ సమస్యల్ని తగ్గించడంలో సాయపడుతుంది.
అశ్వగంధలోని ఔషధ గుణాలు షుగర్ ఉన్నవారికి వరంలా పని చేస్తుంది. దీనిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. డయాబెటిక్ వారికి చాలా మంచిది.
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు అశ్వగంధని తీసుకుంటే అందులోని గొప్ప గుణాలు నాడీ వ్యవస్థని రెస్ట్ తీసుకునేలా చేసి మంచి నిద్రని అందిస్తాయి. దీంతో ఎక్కువసేపు నిద్రపోతారు.
అశ్వగంధ మగవారికి మంచిది. పురుషుల్లో అంగస్తంభన, వీర్య సంబంధిత సమస్యలు, వంధ్యత్వ సమస్యల్ని దూరం చేయడంలో ఈ మూలిక బాగా పనిచేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది.
అశ్వగంధని తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.