జ్వరం వచ్చినప్పుడు గుడ్డు తినవచ్చా?

Samatha

20 july  2025

Credit: Instagram

జ్వరం వచ్చినప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు అస్సలే తీసుకోకూడదని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

 ముఖ్యంగా మన పెద్ద వారు ఫీవర్ వస్తే చాలు అస్సలే కోడి గుడ్డు తినకూడదని చెప్పడమే కాకుండా జ్వరం తగ్గే వరకు ఎగ్ తిననివ్వరు.

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జ్వరం వచ్చినప్పుడు కోడి గుడ్డు తినకూడదా? తింటే ఏమౌతుందో, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

గుడ్డులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు ఒక కోడి గుడ్డు తినాలని చెబుతుంటారు.

కానీ కొందరు జవ్వరం వచ్చినప్పుడు కోడి గుడ్డు తిననివ్వరు. కానీ ఫీవర్ సమయంలో ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

ఫీవర్ వచ్చినప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిపోయి, శరీరం చాలా బలహీనంగా మారిపోతుంటుంది. ఆ సమయంలో గుడ్డు తినాలంట.

దీని వలన గుడ్డులోని పోషకాలు శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయంట

అయిదే జ్వరం ఉన్న సమయంలో కోడి  గుడ్డు తినడం మంచిదే కానీ అమ్లెట్ లేదా ఎగ్ దోశ మాదిరి తినకూడదంట. ఉడకబెట్టింది మాత్రమే తినాలంట.