ముఖానికి పసుపు రాసుకోవడం వలన కలిగే ఐదు ప్రయోజనాలివే!

Samatha

15 july  2025

Credit: Instagram

చాలా మంది ముఖంపై ఉన్న మచ్చలు తొలిగిపోవడానికి మంచి నిగారింపైన ముఖం కోసం ఎక్కువగా పసుపును ముఖానికి అప్లై చేస్తుంటారు.

చాలా మంది ముఖంపై ఉన్న మచ్చలు తొలిగిపోవడానికి మంచి నిగారింపైన ముఖం కోసం ఎక్కువగా పసుపును ముఖానికి అప్లై చేస్తుంటారు.

అయితే పసుపును వారానికి రెండు లేదా మూడు సార్లు ముఖానికి పేస్టులా చేసి రాసుకోవడం వలన అనేక లాభాలు ఉంటాయంట.

పసుపును పురాతన కాలం నుంచే సౌందర్య సంరక్షణ ఉత్పత్తిగా  ఉపయోగిస్తుంటారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

అందువలన పసుపును చర్మానికి రాసుకోవడం వలన ఇది చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా సహజ మెరుపునిస్తుంది.

పసుపును ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే ముఖం పై ఉన్న నల్ల మచ్చలు తొలిగిపోతాయంట.

అలాగే ముఖంపై ఉన్న ట్యాన్ తొలిగించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పసుపును రోజ్ వాటర్‌తో కలిపి పేస్టులా చేసుకోవాలి.

తర్వాత దీనిని ముఖానికి ఫెషియల్ టైప్‌లో అప్లై చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. దీని వలన ముఖంపై ఉన్న ట్యాన్ పోతుందంట.