శ్రావణ మాసంలో కలలో పాములు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

Samatha

15 july  2025

Credit: Instagram

కలలు రావడం అనేది సహజం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన కలలు కంటూ ఉంటారు. కొందరికి తమ పూర్వీకులు కలలో కనిపిస్తుంటారు.

మరికొందరికి చెట్లు, పుట్టలు, పాములు, తమ స్నేహితులు, వాహనాలు, దేవతలు, ఆలయాలు ఇలా అనేకమైనవి కలలో కనిపిస్తుంటాయి.

అయితే శ్రావణ మాసం వచ్చేస్తుంది. హిందూసంప్రదాయాల్లో శ్రావణ మాసానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.

శ్రావణ మాసం శివునికి చాలా ప్రీతికరమైన మాసం అంటుంటారు పండితులు. అందుకే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ నిష్టగా శివయ్యను కొలుచుకుంటారు.

అయితే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో కలలో పాములు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఇది మంచిదా?కాదా అనే విషయాలు తెలుసుకుందాం.

కలలో పాములు కనిపించడం సహజం, కానీ శ్రావణ మాసంలో కలలో పాములు కనిపించడం అనేది మంచి సంకేతం అంటున్నారు నిపుణులు.

పురాణాల ప్రకారం, శ్రావణ మాసంలో కలలో తెల్ల పామును చూడటం శుభ సంకేతం, ఇది ఆర్థిక లాభాన్ని సూచిస్తుందని చెబుతున్నారు పండితులు.

అదే విధంగా కలలో నల్లటి రంగు గల పామును చూడటం కూడా మంచిదేనంట.నలుపు రంగు పాము కనిపించడం ఆ పరమశివుడే స్వయంగా వచ్చి ఆశీర్వాదం ఇచ్చినట్లంట.