చాణక్య నీతి :  ఇలాంటి వ్యక్తులు మరణించే వరకు పేదవారిగానే ఉంటారు!

Samatha

14 july  2025

Credit: Instagram

ఆచార్య చాణక్యడు గొప్ప పండితుడు. ఈయన  తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు  సంపాదించుకున్నాడు.

చాణక్యుడు జ్ఞానవంతుడే కాకుండా ఈయన గొప్ప ఆర్థిక వేత్త, దౌత్యవేత్త. ఈయన తన జీవితంలోని అనుభవాల ఆధారంగా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించారు.

అందులో నేటి సమాజానికి ఉపయోగ పడే ఎన్నో రకాల అంశాలను ఆయన తెలియజేయడం జరిగింది. కాగా, ఆయన ఎప్పుడూ పేదవారిగా ఉండే వ్యక్తుల గురించి తెలియజేశారు.

ఆ చార్య చాణ్యుడు డబ్బు గురించి చాలా విషయాలను తెలియజేశాడు. అయితే కొంత మంది దగ్గర అస్సలే డబ్బు నిలవదంట. వారు ఎవరంటే?

చాణక్యుడి ప్రకారం ఎప్పుడూ ఇతరులను డబ్బు అప్పుగా అడిగే వ్యక్తి దగ్గర అస్సలే డబ్బు ఉండదంట. వీరు ఎప్పుడూ పేద వారిగానే ఉంటారంట.

అలాగే మూర్ఖులు కూడా ఎప్పుడూ ధనవంతులు కాలేరని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు. ఎవరైతే మూర్ఖులతో ఎక్కువ సమయం గడుతారో వారు ఎప్పుడూ పేదవారేనంట.

అదే విధంగా ఏ వ్యక్తి అయితే అవసరానికి మించి తింటాడో, ఆ వక్యక్తి వద్ద కూడా డబ్బు నిలవదంట. వారు ఎప్పుడూ పేదవారిగానే ఉంటారంట.

చాణక్య నీతి ప్రకారం, తప్పు లేదా చెడు పనులు చేసే వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ ధనవంతులు కాలేరు, వారు జీవితం చివరి వరకు పేదవారిగానే ఉంటారంట.