రోజూ కేవలం 30 నిమిషాలు వేగంగా నడవడం వలన రక్తపోటు తగ్గుతుంది. అంతే కాకుండా ఇది గుండె ఆర్యోగం మెరుగుపడుతుంది.
అదే విధంగా బరువు తగ్గాలు అనుకునే వారికి నడక చాలా మంచిది. వేగంగా నడవడం వలన కొవ్వు కరిగిపోతుంది. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు.
నడక శరీరానికే కాకుండా మెదడు పనితీరుకు కూడా చాలా మంచిది. వేగంగా నడవడం వలన ఇది రక్తప్రసరణను పెంచి,జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
అదే విధంగా, పచ్చటి వాతావరణంలో నడవడం వలన ఇది మానసిక స్థితి మెరుగు పడుతుందంట. మంచి ప్రశాతంత కలగుతుందంటున్నారు నిపుణులు.
అలాగే, రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడంలో నడక కీలక పాత్ర పోషిస్తుంది. దీని వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.
క్రమం తప్పకుండా నడవడం వలన ఎముకలు బలంగా తయారు అవుతాయంట. నడక వలన ఎముక సాంద్రత పెరిగి కండరాలు దృఢంగా తయారవుతాయి.
ఇక భోజనం చేసిన తర్వాత కాసేపు వేగంగా కాకుండా కాస్త నెమ్మదిగా వాకింగ్ చేయడం వలన ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
క్రమం తప్పకుండా ప్రతి రోజూ నడవడం వలన ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుందంట.