పాము కాటేసినా చనిపోని జంతువులు ఏవో తెలుసా?

Samatha

4 july  2025

Credit: Instagram

పాములకు భయపడని వారు ఎవరుంటారు. చాలా మంది వీటిని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు. 

ఇక కొంత మంది వీటిని ఫోన్‌లల్లో చూడటానికి కూడా భయపడి పోతుంటారు. ఇక పాములు  ఎక్కువగా ఇళ్లల్లో చాలా చిత్తడిగా ఉండే ప్రదేశాల్లో కనిపిస్తుంటాయి.

పాము కాటు వేస్తే చాలు చికిత్స అందకపోతే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అయితే కొన్ని జంతువులు మాత్రం పాము కాటు వేసినా, చనిపోవు అంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

పాముతో పోరాడే వాటిలో ముంగిస ముందుంటుంది. ఇది పాము కాటు వేసినా చనిపోదు. అలాగే హనీ బ్యాడ్జర్ కూడా పాము కాటు విషాన్ని తట్టుకొని బతుకుతుందంట.

పాముకాటు వేసినా చనిపోని వాటిలో చెక్క ఎలుక అనేది ఒక రకమైన ఎలుక ఒకటి. ఈ ఎలుక పాము విషానికి ఏ మాత్రం ప్రభావితం కాదంట.

కాలిఫోర్నియా గ్రౌండ్ స్క్విరెల్ ఒక రకమైన ఉడుత  పాము కాటు వేసినా చనిపోదంట. దీనికి విషాన్ని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది.

అడవి పందులలో కొన్నింటికి పాము కాటు ఎలాంటి ఇబ్బందిని కలిగించదు. జెనెటిక్ మ్యూటేషన్ జరిగిన కొన్ని అడవి పందులకు పాము విషాన్ని తట్టుకునే శక్తి ఉంటుందంటున్నారు నిపుణులు.

ముల్లపంది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవి ఎక్కువగా అడవుల్లోనే కనిపిస్తుంటాయి. అయితే ఈ జంతువు కూడా సహజంగానే పాము విషాన్ని తట్టుకో గలికే శక్తిని కలిగి ఉంటుందంట.