సూపర్ ఫుడ్ : జీడిపప్పు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Samatha

4 july  2025

Credit: Instagram

జీడి పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే దీనిని క్రమం తప్పకుండా తినాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు.

కాగా, జీడి పప్పు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో, దీని వలన శరీరానికి ఏవిధంగా మేలు జరుగుతుందో చూద్దాం.

జీడిపప్పు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

జీడిపప్పులో మెగ్నీషియం, జింక్, రాగి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా, మెదడుపనితీరుకు దోహదం చేస్తాయి.

ఎముకలను దృఢంగా చేయడంలో కూడా జీడిపప్పు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, భాస్వరం ఎముకల వ్యాధిని తగ్గిస్తాయి.

చర్మాన్ని నిగారింపుగా తయారు చేయడంలో జీడిపప్పు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడుతాయి.

జీడి పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఇవి రక్తంలోని చక్కెరను నియంత్రిస్తాయి. ఇందులో తక్కువ మొత్తంలో గ్లైసెమిక్ ఉంటుంది అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక.

జీడిపప్పులో ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందువలన వీటిని ప్రతి రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.