చిట్టి మిరియాలతో పుట్టేడు లాభాలు..తింటే ఎంత మంచిదో!
samatha
2 july 2025
Credit: Instagram
ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే వాటిలో మిరయాలు ఒకటి. ఇవి అందరి ఇళ్లలో తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే వీటి వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మన పెద్ద వారు జలుబు లేదా గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటే పాలల్లో మిరియాలు వేసి తాగిస్తారు. ఎందుకంటే? దీని ఘాటుకు గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
అయితే వీటితో గొంతు నొప్పి, జలుబు దగ్గే కాకుండా అనేక వ్యాధులను నయం చేసే గుణాలు ఉన్నాయంట. కాగా, నల్ల మిరియాల వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
నల్ల మిరియాలు జీర్ణ రసాలను ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి. అందువలన వీటిని తినడం వలన ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
నల్ల మిరియాలు జీవక్రియను పెంచడమే కాకుండా శరీరంలోని కేలరీస్ బర్న్ చేసి, బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అందుకే బరువు తగ్గే వారికి ఇది మంచి ఎంపిక.
నల్ల మిరియాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ సమ్మేళనాలు, మీ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఇది శరీరంలోని వాపును తగ్గిస్తుంది.
నల్ల మిరియాలు జలుబు, దగ్గు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించి, కఫాన్ని తొలిగించడంలో సహాయపడుతుంది. అందుకే నల్ల మిరియాలను తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి.
అదే విధంగా, నల్లమిరియాల్లో పైపెరిన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది మెదడు పనితీరును మెరుగుపరస్తుందంట.