గుండె లేకుండా ఎవరు బతకరు. ప్రకృతిలో జీవించే చాలా జంతువులకు, పక్షులకు గుండె ఉంటుంది. కానీ గుండెలేని జీవులు కూడా ఉన్నాయని తెలుసా?
కొన్ని జీవులు తమకు గుండె లేకున్నా జీవించగలవంట. ఇంతకీ ఆజీవులు ఏవి అనుకుంటున్నారా? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జెల్లీ ఫిష్. ఇది నీటి ప్రవాహాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ జెల్లీ ఫిష్ అనే జీవులు గుండె లేకుండా సంతోషంగా జీవిస్తాయంట.
ఫ్లాట్ వార్మ్‌లు. ఇవి జీవించడానికి గుండె అవసరం లేదంట. అంతే కాకుండా రక్తం కూడా అవసరం లేకుండా, వాటి శరీరం ద్వారానే ఆక్సీజన్ తీసుకుంటూ బతుకుతాయంట.
సముద్రపు స్పాంజ్‌లు . ఇవి పోరస్ శరీరాలను కలిగి ఉంటాయి. అయితే ఈ జీవులు గుండె అవసరం లేకుండా, నీటి వడపోతతో ఆక్సిజన్ తీసుకుంటూ బతుకుతాయంట.
స్టార్ ఫిష్ గురించి చాలా మందికే తెలుసు. ఈ జీవి కదలడానికి, తినడానికి నీటి నాళాల వ్యవస్థను కలిగిఉండి, వాటితో కదులుతుంటుంది. అయితే ఈ జీవి కూడా రక్తం, గుండె లేకుండా బతుకుతుందంట.
సముద్రంలో జీవించే వింత, అరుదైన జీవుల్లో సముద్రదోసకాయ జీవి గుండె లేకుండా జీవిస్తుందంట. ఇది నీటి ద్వారా ఆక్సిజన్‌ను తీసుకుంటుందంట.
సముద్రంలో ఉండే జీవుల్లో హైడ్రా ఒకటి. ఇవి వాటి సన్నని చర్మం ద్వారా ఆక్సిజన్ తీసుకుంటాయి. వీటికి గుండె, ఊపిరితిత్తులు, రక్తం అవసరం లేకున్నా జీవిస్తాయి.