గ్రీన్ ఆపిల్ తిడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!

samatha 

27 JUN  2025

Credit: Instagram

గ్నీన్ ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ ఆపిల్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన అది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

గ్రీన్ ఆపిల్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్, పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి, ఇన్సులిన్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.

గ్రీన్ ఆపిల్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫ్లేవనాయిడ్స్, పెక్టిన్ వంటి యాటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయంట.

గ్రీన్ ఆపిల్ చర్మఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉండటమే కాకుండా, కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని వలన ఇది చర్మాన్ని నిగారింపుగా తయారు చేస్తుంది.

బరువు నియంత్రించుకోవాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉండే నీరు అధిక ఫైబర్, ఆకలిని తగ్గించి బరువు నిరోధించడానికి సహాయపడతాయి.

అదే విధంగా గ్రీన్ ఆపిల్‌లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

గ్రీన్ ఆపిల్ ఎముకల బలానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం, విటమిన్ కె ఎవక్కువగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వాని చాలా మంచిది.