ఏలకులు చిన్నవని తీసిపారేయ్యకండి..వీటి లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

samatha 

27 JUN  2025

Credit: Instagram

ప్రతి వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాల్లో ఏలకులు ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవి ఉంటాయి.

ఏలకులను స్వీట్ వండే క్రమంలో, అలాగే టీలో, అంతే కాకుండా స్పైసీ వంటకాల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే  దీని వలన వంటలకే రుచి వస్తది.

అయితే ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ చిన్నగా ఉండే ఈ ఏలకులతో బోలేడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవిఏవి అంటే?

ఏలకులు పోషకాల గని అంటారు. ఇందులో,విటమిన్స్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అందుకే జీర్ణ సమస్యలతో బాధపడే వారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందంట.

అలాగే ఒత్తిడితో సతమతం అయ్యే వారు ఒక కప్పు ఏలకుల టీని తాగడం వలన మైండ్ ఫ్రెష్ అవ్వడమే కాకుండా ఒత్తిడి నుంచి బయట పడతారంట.

నోటి దుర్వాసనతో బాధపడే వారు తమ ఆహారంలో ఏలకులను చేర్చుకోవడం చాలా మంచిదంట. వీరు ఏలకులను నోటిలో వేసుకొని నమలడం వలన నోటి దుర్వాసన పోతుందంట.

వికారం, వాంతులు వంటి సమస్యలతో బాధపడే వారు ఏలకుల టీ తాగడం లేదా, వేడి నీటిలో ఏలకులను వేసుకొని ఆ నీటి తాగడం వలన సమస్య తగ్గిపోతుందంట.