గర్భాధారణ సమయంలో మార్నింగ్ సిక్నెస్‌కి బెస్ట్ టిప్స్ ఇవే!
samatha
26 JUN 2025
Credit: Instagram
గర్భందాల్చడం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక అందమైన తీపి జ్ఞాపకం లాంటిది. కొంత మంది మహిళలు సంతానం కోసం ఎన్నో నోములు నోచుకుంటారు.
కానీ కొందరు చాలా త్వరగా గర్భందాల్చుతారు. అయితే గర్భధారణ సమయంలో అనేక సమస్యలు మహిళను చుట్టుముడుతుంటాయి.
ముఖ్యంగా అందులో మార్నింగ్ సిక్నెస్ ఒకటి. రోజు లేవగానే వికారం, వాంతులు వంటి సమస్యలు వారిని ఇబ్బంది పెడుతాయి. అయితే వీటి నుంచి ఉపశమనం కలగలాంటే ఈ టిప్స్ పాటించాలంట. అవి
ప్రతి రెండు లేదా మూడు గంటలకు తృనధాన్యాలు వంటి ఆహారం, పండ్లు తీసుకుంటూ ఉండాలంట. ఇది మీ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచి, వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఎక్కువగా కొబ్బరి నీళ్లు, లేదా నీరు, పండ్ల రసాలు తాగుతూ ఉండాలి. దీని వలన హైడ్రేటెడ్‌గా ఉంటారు. ఇది మీకు తల తిరగడం వంటి సమస్యను దూరం చేస్తుందంట.
అల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎక్కువ మొతాదులో కాకుండా కాస్త తక్కువ అల్లం వేసుకొని టీ తాగడం వలన ఇది వికారాన్ని తగ్గిస్తుందంట.
మార్నింగ్ అలసట నుంచి విముక్తి పొందాలంటే, ఎక్కువసేపు నిద్రపోవాలంట. దీని వలన మీ శరీరం త్వరగా కోలుకుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
ఇది ఇంటర్నెట్ సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. కావునా వైద్యుడిని సప్రదించి పాటించడం మంచిది.