ఖర్జూర పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ప్రతి ఒక్కరూ తినమని సూచిస్తుంటారు.
అయితే చాలా మంది ఖర్జూరను నార్మల్‌గా తింటుంటారు. ఇంకొంత మంది పాలల్లో వేసి తింటారు. కానీ ఖర్జూరాను నానబెట్టి తినడం వలన బోలెడు లాభాలు ఉన్నాయంట. అవి:
ఖర్జూరాను పోషకాల గని అంటారు. ఎందుకంటే? ఇందులో ఎక్కుగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి, వంటి పోషకాలు , ఆమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక నానబెట్టిన ఖర్జూరాలో మాత్రం ఎక్కువమోతాదులో పీచు పదార్థం ఉంటుందంట. అందువలన నానబెట్టిన ఖర్జూర తినడం వలన ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.
అంతే కాకుండా జీర్ణక్రియసక్రమంగా సాగేలా చేసి, కడుపు సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అందుకే జీర్ణ సమస్యలు ఉన్న వారు ఖర్జూరను నానబెట్టి తినడం ఉత్తమం.
అలాగే రక్తపోటు సమస్యతో బాధపడే వారు కూడా దీనిని తినడం ఉత్తమం. నానబెట్టిన ఖర్జూరాలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.
ఎముకల దృఢత్వానికి కూడా నానబెట్టిన ఖర్జూరా చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, విటమిన్ కె. ఎముకలకు బలాన్నిస్తాయి.
నార్మల్‌గా ఖర్జూర తినడం వలన నానబెట్టిన ఖర్జూర తినడం వలన ఇది శరీరానికి తక్షణ శక్తి అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.రక్తహీనతో బాధపడే వారికి కూడా ఇది బెస్ట్.