ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. వెంటనే క్యాన్సర్ టెస్ట్ చేయించుకోండి! 

samatha 

23 JUN  2025

Credit: Instagram

ప్రస్తుతం క్యాన్సర్ అనేది వేగంగా విస్తరిస్తుంది. ప్రతి రోజూ చాలా మంది దీని బారిన పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారికి వరకు ఇది ఎవరినీ వదలడం లేదు.

అందుకే శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకొని, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

అయితే కొంత మందిలో  క్యాన్సర్ అనేది నిశ్శబ్ధంగా మొదలవుతుందంట. అందువలన కొన్ని లక్షణాలు కనిపిస్తే విస్మరించకుండా వెంటనే టెస్ట్‌లు చేయించుకోవాలంటున్నారు నిపుణులు. అవి

క్యాన్సర్ అనేక రకాలు. మగవారికి ఎక్కువగా లివర్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్స్ వస్తుంటాయి.

అలాగే మహిళల విషయానికి వస్తే , థైరాయిడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ క్యాన్స్ ర్ వస్తుంటాయి.

అయితే కొంత మందిలో కొన్ని లక్షణాలు కనిపించినా వారు వాటిని తేలిక తీసుకుంటారు. కానీ మహిళలైనా, పురుషులైనా ఈ లక్షణాలను అస్సలే లైట్ తీసుకోకూడదంట.

క్యాన్సర్ తొలి దశలో సడెన్‌గా బరువు తగ్గడం, అలసట, వికారం, ఆకలి తగ్గడం, నీరసం,మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తంపడటం క్యాన్సర్ లక్షణాలేనంట.

అంతే కాకుండా నాలుగు వారలకుపైగా దగ్గు,వికారం వంటి లక్షణాలు ఎక్కువ రోజుల నుంచి కనిపిస్తే అలాంటి వారు వైద్యుడిని సంప్రదించి క్యాన్సర్ టెస్ట్‌లు చేయించుకోవాలంట.