వావ్.. ఈ అందమైన తేనెటీగలను చూశారా..ప్రపంచంలోనే అతిసుందరమైనవి ఇవే!

samatha 

22 JUN  2025

Credit: Instagram

ప్రకృతి ఈ భూప్రపంచంపై ఎన్నో అందమైన జీవరాసులను అందించింది. వాటిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు.

ప్రపంచంలో ఎన్నో జంతువులు, పక్షులు ఉన్నాయి. అయితే అందులో కొన్ని మాములుగా ఉంటే మరికొన్ని మాత్రం చాలా అందంగా ఉంటూ అందరినీఆకట్టుకుంటాయి.

అయితే తేనటీగలు అంటే గోధుమ రంగులో ఉంటాయని మాత్రమే తెలుసు. కానీ రంగు రంగుల అందమైన తేనెటీగలు ఉన్నాయి, అవి ఏవో చూద్దాం.

ఆర్చిడ్ తేనెటీగ, ఇది నీలి రంగు, ఆకుపచ్చరంగుతో ఉంటుంది. చూడటానికి చాలా అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. ఇది అందమైన తేనెటీగల్లో ఒకటి.

ఆకాశంలోకి ఎగిరినప్పుడు తన మెరుపుతో అందరినీ ఆకట్టుకునే తేనెటీగాల్లో బ్లూ కర్పెంటర్ బీ ఒకటి. ఇది ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

వైలెట్ కార్పెంటర్ బీ తేనెటీగ. ఇది నల్లటి చర్మం, ఊదా రంగుతో ఉంటుంది. ఇది చూడటానికి సీతాకొక చిలుకల కనిపిస్తుంది. యూరోపియన్ అడవుల్లో ఎక్కువ కనిపిస్తాయి.

బంగారు రంగుతో అచ్చం బంగారంలా కనిపించే తేనెటీగల్లో స్వెట్ బీ ఒకటి. ఇది ఆకుపచ్చ బంగారు వర్ణంతో ఉంటుంది. అమెరికాలో ఈ రకం తేనెటీగలు ఎక్కువ కనిపిస్తాయి.

టెడ్డీ బేర్  తేనెటీగ. ఇది నారింజ రంగు, బంగారు రంగులో కనిపిస్తుంది. చూడటానికి అచ్చం టెడ్డీలో బొద్దుగా ఉంటుంది. ఈ రకం తేనెటీగలు ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి.