నీలి నీలి ఆకాశం కాదండోయ్.. ఈ నీలిరంగు పక్షులు తెలుసా?
samatha
17 JUN 2025
Credit: Instagram
నీలి ఆకాశం చూడటానికి ఎంతో బాగుంటుంది. దీని గురించి అందరికీ తెలుసు. కానీ నీలి రంగులో ఉన్న పక్షలను ఎప్పుడైనా చూశారా. మరి చూసేద్దాం పదండి!
బ్లూ జే పక్షి. ఇది చూడటానికి చాలా బాగుంటుంది. అంతే కాకుండా చాలా ఉల్లాసంగా ఉండే ఈ పక్షి నీలిరంగులో చాలా అందంగా ఉంటుంది. ఎక్కువ ఉత్తర అమెరికాల అడవుల్లో ఇవి కనిపిస్తాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద రామచిలుక హైసింత్ మకావ్. ఇది నీలి రంగు రూంపంతో ఉంటుంది. ఈ చిలుకలు ఎక్కువగా దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల వర్షారణ్యాల్లో కనిపిస్తాయి.
చాలా ప్రకాశవంతంగా కనిపించే పక్షల్లో పర్వత నీలం పక్షి ఒకటి. ఇది తళుక్కుమనే నీలి రం గులో ఉంటుంది. ఇవి వసంత కాలంలో పర్వత గడ్డి మైదానాల్లో సంతానోత్పత్తి చేస్తాయి.
అందమైన పక్షుల్లో బ్లూ డాక్నిస్ పక్షి ఒకటి. చూడటానికి చిన్నగా ఉంటుంది. ఇది నీలిరంగు శరీరం,నల్లని రెక్కలతో అందంగా కనిపిస్తుంది. ఇది ఎక్కువ దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి.
సూర్యకాంతిలో మెరిసే ఈ చెట్టుకోయిల చాలా బాగుంటాయి. ఇవి కీటకాల కోసం వెతుకుతూ చిత్తడి నేలలపై ఎగురుతూ కనిపిస్తుంటాయి.
ఫెయిరీవ్రెన్. ఈ పక్షి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇవి ముదురు నీలి రంగుతో కనిపిస్తూ పొదల్లో ఎక్కువగా తిరుగుతాయి.
ఇండియన్ రోలర్. ఇది లేత నీలం రంగులో ఉంటుంది. పచ్చని రెక్కలు, ఛాతి భాగం గోదుమ రంగుతో ఉంటుంది. ఇది భారత దేశంలోని గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తాయి