టమాటాలు తింటే నిజంగానే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయా?

samatha 

16 JUN  2025

Credit: Instagram

టమాటా కర్రీ లేదా చక్నీ ఇలా టమాటాతో చేసే ఏ వంటకాలైనా మంచి రుచిని ఇస్తాయి. అలాగే అవి ఎక్కువగా తినాలనిపిస్తుంటాయి.

ఇక చాలా మంది  టమాటాలతో ఎక్కువగా వంటకాలు చేసుకొని తింటుంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్‌గా ఉండే కూరగాయల్లో టమాటాలు ఒకటి.

అయితే కొంత మంది చెబుతుంటారు. పదే పదే టమాటాలు తినకూడదు. దీని వలన కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని?

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అసలు టమాటాలు తింటే నిజంగానే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయా? ఇందులో నిజం ఎంత ఉందని? దాని గురించే తెలుసుకుందాం.

టమాటాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో విటమిన్ సి, ఫొటాషియం, ఫైబర్ ఫుష్కలంగా ఉంటాయి. కానీ కొంత మంది టమాటాలు తింటే కిడ్నలో రాళ్లు వస్తాయంటారు.

కానీ ఇది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టమాటాల్లో ఆక్సలేట్ ఉంటుందంట. ఇది రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తుంది.

టమాటాలను సాధారణంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు, కానీ ముందుగా రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు టమాటాలకు దూరంగా ఉండాలంట.

టమాటాలు తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయి అనేదాంట్లో ఇప్పటి వరకు ఖచ్చితమైన నిర్ధారణ లేదు, రాళ్లు రాకుండా ఉండాలి అంటే ఎక్కువగా వాటర్ తాగాలని సూచిస్తున్నారు నిపుణులు