ప్రపంచంలోనే అత్యంత సుందరమైన పింక్ పక్షుల గురించి తెలుసా?
samatha
15 JUN 2025
Credit: Instagram
అమెరికన్ ఫ్లెమింగో ఇది రంగు రంగుల పొడవైన పక్షి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అంతే కాకుండా గులాబీ రంగుల ఈకలు పొడవాటి కాళ్లు, పొడవాటి మెడతో చూడటానికి చాలా బాగుంటుంది.
రోజేట్ స్పూన్ బిల్ పక్షి చూడటానికి బ్యూటిఫుల్‌గా ఉంటుంది. పొడవాటి ముక్కు పెద్ద కాళ్లు, లేత గులాబీ రంగులో చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.
ఎర్రగులాబీ రంగు ఛాతీతో బూడిత రం గు రెక్కలతో చూడగానే ప్రకాశవంతంగా కనిపించే గలా కాకాటూ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది ఓ అందమైన ఆస్ట్రేలియన్ చిలుక.
చూడటానికి చాలా చిన్నగా కనిపించినప్పటికీ తన కూతతో అందరి మనసు దోచేస్తుంది పింక్ రాబిన్, ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. దీని ఛాతి బాగం గులాబీరంగుతో ఉంటుంది.
మేజర్ మిచెల్స్ కాకాటూ.. ఇది ఓ అతిసుందరమైన చిలుక. ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. గులాబీ, తెలుపు ఈకలతో చాలా అందంగా ఉంటుంది ఈ పక్షి.
బోర్కే రామచిలుక. దీనిని పక్షుల స్నేహితుడు అంటారు. చాలా మధురమైన స్వభావం కలిగిన ఈ చిలుక, లేత గులాబీ రంగుతో చూడటానికి చాలా బాగుంటుంది.
అన్ని పౌరాల్లోకెళ్లా చాలా అందమైన పావురం తల గల పండ్ల పావురం. ఇది గులాబీ రంగు తల, ఆకుపచ్చ ఈకలను కలిగి ఉంటుంది. దీని అందం చూడటానికి రెండు కళ్లు చాలవు.
రోజ్ ఫించ్ సుందరమైన పక్షుల్లో ఇదొక్కటి, ఎర్రటి గులాబీ, ఎరుపు రంగు ఈగలతో ఉండే మగ రోజ్ ఫించ్ యురేషియాలో ఎక్కువ కనిపిస్తాయి.