బీచ్‌కి వెళ్తే ఆనందమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా!

samatha 

16 JUN  2025

Credit: Instagram

బీచ్‌కు వెళ్లడం ఎవ్వరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది వేసవి వచ్చిందంటే చాలు బీచ్‌కు వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు.

ఇక కొంత మంది వర్షాకాలంలో కూడా బీచ్ వద్దకు వెళ్లి తమ స్నేహితులు, పండితులతో సందడి చేస్తారు. చాలా ఆనందంగా గడుపుతారు.

ఇక బీచ్‌కు వెళ్తే చాలా సంతోషంగా, ఆనందంగా అనిపిస్తుందని అందరికీ తెలిసిందే, కానీ ఆనందమే కాకుండా దీని వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట. అవి

బీచ్‌కు వెళ్లడం వలన సహజంగా విటమిన్ డి పొందవచ్చు. సూర్యకాంతి శరీరానికి డి విటమిన్ అందిస్తుంది. ఇది ఎముకల బలోపేతానికి చాలా అవసరం.

సముద్రతీరంలో ఎంజాయ్ చేయడం వలన అక్కడి స్వచ్ఛమైన గాలి, ఊపిరితిత్తులకు విశ్రాంతినిచ్చి, శ్వాసను మెరుగుపరుస్తుంది. శ్వాస తీసుకోవడంలో సమస్యలుండవు.

స్నేహితులతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా అలలు,పచ్చటి ప్రకృతి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి.

అంతే కాకుండా శారీరకంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బీచ్‌లో నడవడం,పరిగెత్తడం అనేది శరీరానికి మంచి వ్యాయామం అంట.

చర్మ సంరక్షణలో కూడా బీచ్ కీలక పాత్ర పోషిస్తుంది. సముద్రపు నీరు ఉప్పునీరు. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, సహజకాంతినిస్తాయంట.