మీకు తెలుసా? భారత్ కంటే బంగారం ధర ఆ దేశంలోనే ఎక్కువ!
samatha
20 JUN 2025
Credit: Instagram
మగువలు ఎక్కువగా ఇష్టపడే దాంట్లో బంగారం ముందుంటుంది. ఏ చిన్న శుభకార్యం, ఫంక్షన్ జరిగినా సరే ఎక్కువ బంగారం కొనడానికి ఇష్టపడుతుంటారు.
చాలా మంది మహిళలు ఒంటి నిండా బంగారం ధరలు ధరించి ఆనంద పడిపోతారు. ఇక ఇంట్లో పెళ్లి ఉందంటే చాలు మొదట అందరికీ గుర్తు వచ్చేది బంగారం కొనాలి, బంగారం ధర!
కానీ ప్రస్తుత రోజుల్లో బంగారం ధర భారీగా పెరుగుతూ, సామాన్యుల పాలిట శాపంగా మారుతుంది. అయితే చాలా మంది భారత దేశంలోనే బంగారం ధర ఎక్కువ అనుకుంటారు.
కానీ భారత దేశం కంటే వేరే దేశంలో బంగారం ధర చాలా ఎక్కువంట. అక్కడ ఇప్పటికే తులం బంగారం ధర ఎప్పుడూ లక్ష మార్క్ దాటింది అంటున్నారు నిపుణుల. కాగా, దాని గురించి తెలుసుకుందాం.
చాలా మంది బంగారం ధర తక్కువ ఉండాలనుకుంటారు. ఇక ఒక్కో దేశంలో ఒక్కో విధంగా బంగారం ధర అనేది ఉంటుంది.
బంగారం ధర అనేది పన్నులు, దిగుమతి, ఎగుమతి డిమాండ్, సరఫరాపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో భారతదేశంలో ఎక్కువ ధరకు బంగారం లభిస్తుంటుంది.
దుబాయ్‌లో చాలా చౌకగా బంగారం దొరుకుతుంది. కానీ భారత్ కంటే మయన్మార్లో బంగారం ధర చాలా ఎక్కువ ఉంటుందంట. అక్కడ ఇప్పటికే బంగారం ధర లక్ష మార్క్ దాటి చాలా రోజులవుతుందంట.
అక్కడ తులం బంగారం ధర రూ.1,02,138. ఇక్కడే కాకుండా టర్కీ, ఇండోనేషియా, ఇరాన్‌లోను బంగారం ధర చాలా ఎక్కువగానే ఉంటుందంట.