గులాబీ పూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అంతే కాకుండా ముఖసౌందర్యాన్ని కూడా పెంచుతాయి.
అయితే ఈ గులాబీలతో అందంమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. అవి ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గులాబీ రేకులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంట.వీటిలో విటమిన్ ఇ, పాలీఫెనాల్స్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని వలన అనేక వ్యాధులకు ఇది బెస్ట్ మెడిసన్.
నిపుణుల అభిప్రాయం ప్రకారం గులాబీ రేకులను తినడం వల త్వరగా బరువు తగ్గే ఛాన్స్ ఉందంట. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్.
అదే విధంగా, చాలా మంది స్ట్రెస్‌గా ఫీల్ అవుతారు. అలాంటి వారు ప్రతి రోజూ కొన్ని గులాబీ రేకులు తినడం వలన ఆందోళన, ఒత్తిడి నుంచి బయటపడుతారంట.
గులాబీ రేకులలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందంట.అందుకే గులాబీరేకులు రోజూ కొన్ని తినాలంట.
అలాగే, గులాబీ రేకులు చర్మానికి కూడా మేలు చేస్తాయంట. గులాబీ రేకులు తినడం వలన ఇందులోని విటమిన్ ఎ,విటమిన్ సి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా,నిగారిపుగా చేస్తాయంట.
అదే విధంగా గులాబీ రేకులను ప్రతి రోజూ తినడం వలన హార్మోన్ల అసమతుల్యత, పీరియడ్స్‌లో సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందంట. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.