ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే?
samatha
17 JUN 2025
Credit: Instagram
ఆషాడం వచ్చిందంటే చాలు ప్రతి ఆడపిల్లా తన చేతులను అందంగా గోరింటాకుతో ముస్తాబు చేసుకుంటుంది. ఈ మాసం వచ్చిందంటే చాలు ప్రతి అమ్మాయి చేయి గోరింటాకుతో మెరిసిపోతుంటాయి.
అంతే కాకుండా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన అవి మగువల అందానికి మరింత మెరుగులు దిద్దినట్లు ఉంటుంది.
ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన ఇది అమ్మాయిల అందాన్ని పెంచుతుందంట.
అంతే కాకుండా, వారికి ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వలఇది వారిలో ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా మానసిక స్థితిని మెరుగు పరుస్తుందంట.
అదే విధంగా శరీరంలోని వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుందంట. అందుకే ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలంటున్నారు నిపుణులు.
గోరింటాకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెంచడంలో గోరింటాకు కీలక పాత్ర పోషిస్తుందంట.
అలాగే మహిళలు ఈ సమయంలో పొలం పనులు ఎక్కువగా చేస్తారు. అయితే అప్పుడు చేతి వేళ్లు గోర్లు పాడైపోతాయి. వాటిని రక్షించడానికి గోరింటాకు పనిచేస్తుందంట.