ప్రతి రోజూ ఒక అంజీర్ తింటే డాక్టరే అవసరం లేదంట.. బోలెడు లాభాలు!
samatha
20 JUN 2025
Credit: Instagram
అంజీర్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే కనీసం రోజులో ఒక్కటైనా ఈ పండును తినాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.కాగా, అంజీర్ తినడం వలన ఎలాంటి లాభాలున్నాయో చూద్దాం.
అంజీర్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన వీటిని ప్రతి రోజూ తినడం వలన ఇవి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడమే కాకుండా, మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి.
అంజీర్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అందుకే ప్రతి రోజూ ఒక అంజీర్ పండు తింటే గుండె జబ్బుల ప్రమాదమే ఉండదంట.
అంజీర్ పండ్లను ప్రతి రోజూ తీసుకోవడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక.
అంజీర్ పండ్లలో కాల్షియం, పొటాషియం, పుష్కలంగా ఉంటాయి. అందువలన ఎముకల బలానికి ఇవి చాలా మేలు చేస్తాయి. ప్రతి రోజూ తినడం వలన ఎముకలు దృఢంగా తయారవుతాయి.
అంజీర్ పండ్లు సహజ విరేచనకారిగా పని చేస్తాయి. వీటిని తినడం వలన జీవక్రియ సక్రమంగా సాగి, వర్షకాలంలో మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
అంజీర్ పండులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని ప్రతి రోజూ తినడం వలన ఇది గట్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది.
అంజీర్ పండులో కెలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇది బరువును నియంత్రణలో ఉంచుతుంది. అందుకే బరువు తగ్గాలి అనుకునే వారికి బెస్ట్ ఎంపిక.